News

10న రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇప్తార్ విందు


ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నర్సింహన్‌ రంజాన్‌ మాసం సందర్భంగా ఈ నెల 10వ తేదీన రాజ్‌భవన్‌లో ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు లతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, శాసనసభ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను ఆహ్వానించారు. రాజ్‌భవన్‌లోని దర్భార్‌ హాల్‌లో ప్రార్థనలు నిర్వహించాక ఇఫ్తార్‌ విందు జరగనుంది. గత ఏడాది ఈ విందుకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు ఒక్కరే హాజరయ్యారు